• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పెళ్ళికి అండగా నిలిచిన తోటి విద్యార్థులు

VZM: కొత్తవలస మండలం చీపురువలస గ్రామానికి చెందిన కారుకొండ నూకరాజు కూతురు ఆర్థిక స్థోమతతో కుంగిపోయింది. ఆమె కూతురు పెళ్లి విషయాన్ని తండ్రికి తెలపగా, తనతోపాటు పదోతరగతి కలసి చదువుకొన్న తోటి విద్యార్థులకు తన కూతురు బాధను స్నేహితులకు చెప్పడంతో రూ.1,20,116 నగదును సమకూర్చి వివాహా నిమిత్తం మంగళవారం అతనికి అందజేశారు.

February 24, 2026 / 01:49 PM IST

పెనుమంట్ర-2లో 104 ఉచిత వైద్య శిబిరం

W.G: పెనుమంట్ర-2 సచివాలయం పరిధిలో మంగళవారం 104 వాహనం ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించి, స్థానికులకు మధుమేహం, రక్తపోటు వంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో, ఏఎన్ఎం లక్ష్మి, అంగన్వాడీ సిబ్బంది, మేల్ అసిస్టెంట్ పాల్గొన్నారు.

February 24, 2026 / 01:48 PM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

కృష్ణా: మచిలీపట్నానికి చెందిన కర్ల శేషలతకు వైద్య ఖర్చులు నిమిత్తం మంజూరైన రూ.24001 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణి కుమార్ ఈరోజు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. శేషలత వైద్య చికిత్స నిమిత్తం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్లగా, మంత్రి స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించారన్నారు.

February 24, 2026 / 01:45 PM IST

‘గ్రంథాలయ సెస్‌లు విడుదల చేయాలి’

SKLM: జిల్లా గ్రంథాలయ సంస్థకు పట్టణ, గ్రామీణ పంచాయతీల నుంచి రావలసిన ఎనిమిది శాతం గ్రంథాలయ సెస్సులను విడుదల చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శంకర్రావు కోరారు. సారవకోట మండల కేంద్రంలోని శాఖా గ్రంధాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా గ్రంధాలయ సంస్థలో 70 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందన్నారు.

February 24, 2026 / 01:42 PM IST

గుమ్మలక్ష్మీపురంలో జీవనోపాధుల సర్వేపై సమీక్ష.

PPM: జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధారాణి జీవనోపాధుల సర్వే, ప్రాజెక్ట్ ప్రాధాన్యతా పనులు, రికవరీలపై మండల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మహిళా మార్ట్‌ను సందర్శించి అమ్మకాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం ఫైనాన్స్, మండల సిబ్బంది పాల్గొన్నారు.

February 24, 2026 / 01:41 PM IST

జిల్లాకు 2390 టన్నుల యూరియా

KDP: రబీ వ్యవ సాయ అవసరాలకు కడప, అన్నమయ్య జిల్లాలకు 2900 టన్నుల యూరియా సోమవారం కడప రైల్వే రేక్ పాయింట్‌కు వచ్చింది. ఈ మేరకు వచ్చిన ఎరువులను కడప, అన్నమయ్య నంద్యాల, కర్నూలు జిల్లాకు సరఫరా చేశారు. ఇందులో కడప జిల్లాకు 2,390 టన్నులు రాగా.. ఇందులో మార్క్‌ఫెడ్ 1,200 టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 1,190 టన్నులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

February 24, 2026 / 01:35 PM IST

‘పారదర్శకంగా, సమగ్రంగా డేటా సేకరణ చేయాలి’

NDL: దేశ అభివృద్ధి ప్రణాళికలకు జనగణన గణాంకాలు బలమైన పునాది వంటివని కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని అయ్యలూరు మెట్టలో ఉన్న ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన జనగణన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఏ ఒక్క వ్యక్తి గణనకు దూరం కాకుండా సమగ్రతతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

February 24, 2026 / 01:31 PM IST

పొగిరి కుష్ఠు ఆసుపత్రిలో సేవా కార్యక్రమం

VZM: సమాజంలో అణగారిన వర్గాలైన కుష్ఠు రోగులకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బెతనీ మిషన్ ఓక్ ల్యాండ్ స్కూల్స్ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస రావు అన్నారు. రాజాం మండలం పొగిరి కుష్ఠు ఆసుపత్రిలో ఉన్న రోగులకు మంగళవారం దుప్పట్లు, ఆహారం, అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారిని ఆత్మీయంగా పలకరించి ధైర్యం చెప్పారు.

February 24, 2026 / 01:31 PM IST

మాదకద్రవ్యాల దుర్వినియోగంపై వ్యాసరచన పోటీలు

CTR: పాలసముద్రం ZPHS పాఠశాలలో SI శ్రీ రాజశేఖర్ రెడ్డి విద్యార్థులకు మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలు ఆరోగ్యం, విద్య, భవిష్యత్తును నాశనం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు మంచి అలవాట్లు, సానుకూల కార్యకలాపాలను అనుసరించాలని సూచించారు.

February 24, 2026 / 01:30 PM IST

బస్టాండ్ వద్ద ఒక వ్యక్తి మృతి

NDL: బనగానపల్లె టౌన్ బస్టాండ్‌లో మంగళవారం ఒక వ్యక్తి మృతి చెందాడు. అతను మహానంది గ్రామానికి చెందినవాడని సమాచారం లభించింది. స్థానికులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరింత సమాచారం కోసం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 24, 2026 / 01:28 PM IST

‘వారిపై చర్యలు తీసుకోవాలి’

అల్లూరి: గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులపై విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 300 దేవాలయాలపై దాడులు చేసి కూల్చివేశారని ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం శాసనసభలో మాట్లాడారు.

February 24, 2026 / 01:28 PM IST

రెండో రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

ATP: గుత్తి ఐసీడీఎస్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు సీఐటీయు నాయకులతో కలిసి మంగళవారం 2వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అంగన్వాడీ టీచర్లు కళ్యాణి మాట్లాడుతూ.. సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని, అంగన్వాడీ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, ప్రీస్కూల్‌ పిల్లలకు తల్లికి వందనం అమలు చేయాలన్నారు. కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలన్నారు.

February 24, 2026 / 01:28 PM IST

పశు వైద్యశాలలు ఆధునికరించాలి: ఎమ్మెల్యే

NLR: వ్యవసాయం తర్వాత లక్షలాది రైతు కుటుంబాలకు స్థిరమైన రోజువారీ ఆదాయం అందించే పాడి రంగాన్ని బలోపేతం చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మంగళవారం శాసనసభ సమావేశాల సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, పాడి పరిశ్రమ రెండు కళ్ళుగా అభివర్ణించారు. పశు వైద్యశాలలు ఆధునికరించాలన్నారు.

February 24, 2026 / 01:26 PM IST

కల్తీ నెయ్యి వ్యవహారం వెనుక కుట్ర దాగి ఉంది: MLA

GNTR: కల్తీ నెయ్యి వ్యవహారం వెనుక కుట్ర దాగి ఉందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మంగళవారం అసెంబ్లీలో ఆరోపించారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసాదంలో కల్తీ జరగడం యాదృచ్ఛికం కాదని, ఇది పక్కా ప్రణాళికతో చేసిన పని అని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమలలో జరిగిన అక్రమాలు బ్రిటిష్ పాలనకంటే దారుణంగా ఉన్నాయన్నారు.

February 24, 2026 / 01:25 PM IST

గోతులదొడ్డి సర్పంచ్ టీడీపీ పార్టీకి రాజీనామా..!

KRNL: గోతులదొడ్డి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, సర్పంచ్ లక్కీ హనుమంతమ్మ భర్త టీడీపీ బీసీ సెల్ మండల ఉపాధ్యక్షులు లక్కే గోవింద్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత 30 సంవత్సరాలుగా టీడీపీ పార్టీనే నమ్ముకుని పార్టీ కోసం కష్టపడితే పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరాలు అయినా గుర్తించకపోవడం చాలా బాధాకరమని వాపోతూ రాజినామా చేసినట్లు సమాచారం.

February 24, 2026 / 01:25 PM IST