రైల్వేలోని ఆయా విభాగాల మధ్య సమన్వయం లేక ఈ సమస్య ఏర్పడిందని తెలుస్తున్నది. కాగా రైల్వే ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె చేపట్టడడంతో ఈ పరిణామం ఎదురైందని సమాచారం. ఏది ఏమైనా ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం.. అంతర్వేదిలో రథం దగ్ధం ఇలా సీఎం జగన్ తర్వాత అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. జగన్ అధికారంలో ఉన్న 4 సంవత్సరాల్లో 280కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయి.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో(Markapuram) కొత్తగా ఓ హోటల్ ప్రారంభించారు. అయితే మొదటి రోజు కావడంతో అదిరిపోయే ఆఫర్ ప్రకటించి భోజన ప్రియులను టెంప్ట్ చేశారు. ఒక్క రూపాయి నోట్ ఉంటే చాలు చికెన్ బిర్యానీ (ChickenBiryani)పార్శిల్ తీసుకెళ్లొచ్చని ప్రకటించారు. అంతే ఇక రూపాయి నోట్ ఇచ్చి బిర్యానీ తీసుకెళ్లేందుకు మాసం ప్రియులు ఉదయం నుంచే హోటల్ ముందే క్యూ కట్టారు.
ఏపీ (AP) ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లుకు సంబంధించి జగన్ సర్కార్ (Jagan Sarkar) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ వాహనాలకు కొత్త సిరీస్ తో నెంబర్లు కేటాయించనున్నారు. అందుకోసం మోటార్ వాహనాల చట్టంలో సవరణ తీసుకురానున్నారు. ఆ మేరకు రాష్ట్ర రవాణ శాఖ (Department of Transport) నోటిఫికేషన్ జారీ చేసింది.
కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామలోరి కల్యాణం కమనీయంగా జరిగింది. బుధవారం అర్ధరాత్రి సీతారాముల కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛరణల నడుమ నిర్వహించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు రామనామస్మరణతో మార్మోగాయి.
Navy Commander : ప్యారా చూట్ లో వచ్చిన సాంకేతిక లోపం కారణంగా ఓనేవీ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి కిందకు దూకే క్రమంలో ప్యారాచ్యూట్ తెరుచుకోకపోవడం తో ఇండియన్ నేవీ మెరైన్ కమాండో కన్నుమూశారు. శిక్షణా కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వైద్యుడి కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆస్పత్రులు, వైద్యుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఫ్యామిలీ డాక్టర్ తో వ్యాధులు ముదరకముందే గుర్తించవచ్చు.
రామోజీ రావు కి నాగబాబు మద్దతు తెలపడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయనకు ప్రజారాజ్యం జెండా పీకేద్దాం అన్నప్పుడు మీరేం చేశారంటూ గుర్తు చేస్తున్నారు.
వైయస్ జగన్ ఇంతకుముందు ఎమ్మెల్యేలను బానిసలుగా చూశాడని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వారిని బతిమాలుతున్నడని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.