Tirumala:తిరుపతి ఏడుకొండల వాడికి బెంగళూరుకు చెందిన భక్తుడు భారీ విరాళం ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. మురళీకృష్ణ అనే భక్తుడు శ్రీవారి దేవస్థానానికి దాదాపు 250 ఎకరాల భూమిని విరాళంగా ఇవ్వనున్నాడు. సైదాపురం మండలం పోతేగుంటలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.జవహర్‌రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదివారం పరిశీలించారు. బెంగళూరు వాసి మురళీకృష్ణకు తిరు...
ఒకవేళ ఈ బిడ్ ను తెలంగాణ ప్రభుత్వం పొందితే మాత్రం ఏపీలో సీఎం కేసీఆర్ కు ఊహించని అభిమానం పెరుగుతుంది. ఏపీలోకి ప్రవేశించేందుకు ఇది ఒక సింహద్వారంగా మారనుంది.
ఏపీలో కరోనా(Corona)తో ఒకరు మృతి చెందారు. కుక్కునూరు మండలం కొండపల్లికి చెందిన 62 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని చికిత్స కోసం మార్చి 30వ తేదిన భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే కరోనా సోకి ఆ వ్యక్తి 8న మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన 175 చోట్ల అభ్యర్థులు బరిలో ఉంటారని ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ స్పష్టంచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో వైసీపీ, టీడీపీ విఫలం అయ్యాయని ఆరోపించారు.
ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu) సెల్ఫీ విత్ టిడ్కో ఇళ్ల అంశంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు(MLC Varudu Kalyani) కళ్యాణి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ధైర్యముంటే తాము నిర్మించిన 17 వేల కాలనీల వద్దకు రావాలని కోరారు. అక్కడకు వచ్చి లబ్దిదారులతో సెల్ఫీలు దిగాలని సవాల్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ(TDP) హాయంలోనే టిడ్కో ఇళ్లలో భారీగా అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు.
MLA Kethireddy: ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ మధ్య వివాదంతో మీడియాలో ఇటీవల హాట్ టాపిక్ గా మారారు. అంతకుముందు నుంచే ‘గుడ్ మార్నింగ్’ అంటూ కేతిరెడ్డి నిత్యం జనం మధ్య తిరుగుతుంటారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తుంటాయి. ధర్మవరం పట్టణం శివానగర్ లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమాన్ని ప్రారంభించా...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి(Prahlad Joshi), బీజేపీ జాతీయ నాయకులు అరుణ్ సింగ్‌ల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. గత నెలలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కిరణ్ కుమార్.. భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి ముందు ఆ పార్టీ ముఖ్య నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్టుగా తెలుస...
తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవు దినాల కారణంగా తిరుమల శ్రీవారి(Srivari)ని దర్మించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు లభించిన సెలవులను సద్వినియోగం చేసుకోవాలని భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల చేరుకోవడంతో రద్దీ ఏర్పడింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు(Devotees) పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు
విద్యుత్ మీటర్ల పేరుతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan mohan reddy) 13 నుంచి 14 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రాం(tdp leader Pattabhi Ram) ఆరోపించారు. ఆ క్రమంలో మీటర్ల కాంట్రాక్టులు మొత్తం బినామీలకే ఇచ్చుకున్నట్లు గుర్తు చేశారు.
మూడు రోజులు వరుస సెలవులు కావడంతో తిరుమల (Tirumala) కొండకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలో నేడు కూడా విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. ఉద్యోగులు(employees), ఇంటర్ పరీక్షలు పూర్తయిన విద్యార్థులతో తిరుమల క్షేత్రం కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ బాగా పెరిగిపోవడంతో స్వామివారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. సర్వదర్శన క్యూలైన్ శిలాతోరణం అవతలి వరకు ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం(Anantapur) జిల్లాలో 15 అరుదైన ఎర్త్ ఎలిమెంట్స్ (REE) నిక్షేపాలను హైదరాబాద్‌కు చెందిన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(NGRI) కనుగొంది. వాటిని సెల్‌ఫోన్‌లు, టెలివిజన్‌లు, కంప్యూటర్‌లు, ఆటోమొబైల్స్ వంటి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలలో ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. దీంతో ఆయా ఖనిజ ప్రాంతాలపై ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) బదిలీల పర్వం కొనసాగుతున్నది. ఐఏఎస్‌ను ట్రాన్స్‌ఫర్ చేసిన 24 గంటల్లోనే ఐపీఎస్‌లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. 12 జిల్లాలకు కొత్త ఎస్పీలను తీసుకొచ్చింది.శుక్రవారం 54 మంది ఐఏఎస్ (IAS) అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసిన ప్రభుత్వం తాజాగా ఐపీఎస్‌లను (IPS) బదిలీ (Transfer) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.