• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా పరీక్షలు రాయండి: కలెక్టర్

PPM: జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ థియరీ పరీక్షలకు సంబంధించి సర్వం సిద్ధమని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. విద్యార్థులు అనవసర ఆందోళనకు గురికాకుండా, ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని కోరుతూ, విద్యార్థులందరికీ ‘ఆల్ ది బెస్ట్’! అంటూ కలెక్టర్ విషెస్ చెప్పారు.

February 21, 2026 / 05:31 PM IST

‘ఎమ్మెల్సీ అనంతభాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’

KRNL: రాష్ట్రంలో సంచలనాన్ని రేపిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసులో సీబీఐ ఆయన భార్యను కూడా ఏ2 ముద్దాయిగా చేర్చిందని సమతా సైనిక్ దళ్ ప్రతినిధి రంగయ్య పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీని పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరగకుండా వ్యవస్థలలో సడలింపు చేస్తున్న అనంతబాబు కుటుంబంపై సీబీఐ షాక్ ఇచ్చారన్నారు.

February 21, 2026 / 05:30 PM IST

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ ఐ

KDP: ప్రస్తుతం దొంగతనాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ మధుసూదన్ రెడ్డి సూచించారు. శనివారం పులివెందుల పట్టణంలోని స్థానిక పార్నపల్లె బస్టాండ్, కడప బస్టాండ్, తదితర ప్రాంతాలలో ప్రజలకు ఆయన దొంగతనాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు ఆభరణాలను ధరించి బస్సులలో ప్రయాణించరాదన్నారు.

February 21, 2026 / 05:30 PM IST

దుంపగడప కాలేజీని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్

W.G: ఆకివీడు మండలం దుంపగడప వివిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజను కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. గత సంవత్సరం డిగ్రీ ఫైనల్‌లో ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థిని శోభారాణికి రూ.3 వేలు నగదు బహుమతిని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ కె.సుజాత, అధ్యాపకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 05:30 PM IST

సోషలిజమే దేశానికి దిక్కు: సీపీఎం

TPT: సత్యవేడులో రెడ్ బుక్ డే సందర్భంగా శనివారం సీపీఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పెట్టుబడిదారీ విధానంలో అసమానతలు, దోపిడి పెరుగుతున్నాయని, సోషలిజమే దేశానికి ప్రత్యామ్నాయమని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. కార్మికులు, రైతుల సమస్యలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

February 21, 2026 / 05:27 PM IST

చిన్నారులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

NTR: నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో, పార్టీ కార్యకర్త నగిరికంటి రమేష్ కుమార్తె, కుమారుల నూతన వస్త్రాబహుకరణ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, పార్టీ నాయకులతో కలసి చిన్నారులకు అక్షింతలు వేసి ఆశీర్వదించి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 05:23 PM IST

పల్నాడు పౌరుషం, వైబ్రేషన్లు అద్భుతం: సీఎం

PLD: వినుకొండలో జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా ప్రసంగించారు. పల్నాడు గడ్డపై ప్రజల స్పందన చూస్తుంటే నియోజకవర్గానికి మంచి రోజులు రానున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి పౌరుషం, వైబ్రేషన్లు అద్భుతమని కొనియాడారు. ఇటీవల జరిగిన కోటప్పకొండ తిరునాళ్లను తాను స్వయంగా పర్యవేక్షించి విజయవంతం చేశామని గుర్తు చేశారు.

February 21, 2026 / 05:21 PM IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్యాధికారి తనిఖీ

NLR: మండల కేంద్రమైన వరికుంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్యాధికారిని సుజాత తనిఖీ చేశారు. ఆమె రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు. కేటాయించిన లక్ష్యాలను నూరు శాతం సాధించాలన్నారు. వైద్యశాలకు వచ్చే రోగుల పట్ల స్నేహభావంతో మెలగాలన్నారు. సర్పంచ్ దిలీప్ కుమార్ పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు.

February 21, 2026 / 05:20 PM IST

NASO పోటీల్లో సత్తా చాటిన గుంతకల్లు విద్యార్థి

ATP: గుంతకల్లులోని భాష్యం స్కూల్లో 6వ తరగతి చదువుతున్న ప్రమోద్ కుమార్ అనే విద్యార్థి ఇటీవల జరిగిన NASO పోటీలలో అత్యంత ప్రతిభ కనిపించాడు. ఇండియా వైడ్ 9వ ర్యాంకు స్టేట్ వైడ్ 2వ ర్యాంకు సాధించాడు. శనివారం ఆ విద్యార్థిని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి తన చాంబర్లో శాలువాతో సత్కరించి సన్మానించి అభినందించారు.

February 21, 2026 / 05:20 PM IST

అగ్నిప్రమాదంలో జీడి తోట దగ్ధం

AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో కొక్కిరాపల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో జీడి తోట దగ్ధం అయింది. స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియదని రైతులు తెలిపారు.

February 21, 2026 / 05:05 PM IST

‘ఉజ్వల భవిష్యత్తుకు వ్యక్తిగత అవగాహన అవసరం’

PPM: ఆర్ధిక స్వాతంత్య్రంతోనే మహిళలు ఆర్ధికంగా వృద్ధి చెందుతారని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఒకరిపై ఆధారపడకుండా తమకు తాము సంపాదించిన డబ్బులతో అవసరాలను తీర్చుకోవడమే ఆర్ధిక స్వాతంత్య్రం అని పేర్కొన్నారు. ఎవరిపై ఆధారపడనప్పుడే అనుకున్నవి సాధించగలరని, విజ్ఞానంతో పాటు సంపాదించుకునేందుకే చదువు అని అన్నారు.

February 21, 2026 / 05:05 PM IST

పరిశుభ్రత వాహనం ప్రారంభంచిన ఎమ్మెల్యే

ELR: స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ద్వారా తాటియాకులగూడెంలో గ్రామ పంచాయతీకి అందించిన పరిశుభ్రత వాహనం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. గ్రామ పరిశుభ్రత మెరుగుపడేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి గణ్ణమడుగు రవికుమార్, సర్పంచ్ వనమా రాంబాబు, పీడీవో ఆరేపల్లి చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 05:04 PM IST

‘నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యం’

SKLM: నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అశోక్ బాబు అన్నారు. శనివారం ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామపంచాయతీలో బలిజపల్లి జానకి ప్రభుత్వం కేటాయించిన భూమిలో నూతనంగా నిర్మించిన గృహాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వెంకటరావు అధికారులు , నాయకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 05:03 PM IST

సీఎం పేదల గుండెల్లో ధైర్యాన్ని నింపుతున్నారు: MLA

NLR: 20 నెలల స్వల్ప కాలంలోనే కోవూరు నియోజకవర్గంలో ​ 687 మంది అనారోగ్య బాధితులకు 7 కోట్ల 27 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. శనివారం 24 వ విడతగా 35 మందికి రూ. 55 లక్షల 42 వేల చెక్కులు అందించమన్నారు. ​వేలాది మందికి పునర్జన్మ ప్రసాదిస్తూ.. పేదల గుండెల్లో ధైర్యాన్ని నింపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2026 / 05:03 PM IST

జీరో లిట్టర్ గవర్నెన్స్ పై అవగాహన

ASP: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళ డిగ్రీ కళాశాలల్లో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా జీరో లిట్టర్ గవర్నెన్స్‌పై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. చెత్త రహిత రాష్ట్రంగా మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యమని ప్రిన్సిపాల్స్ డా కేబీకే నాయక్, చలపతిరావులు తెలిపారు. పరిసరాలను శుభ్రపరిచే భాద్యత అందరిదీ అని అన్నారు.

February 21, 2026 / 05:01 PM IST