MLC Elections : ఆంధ్రప్రదేశ్ లో మూడు పట్టభద్రుల స్థానాలకు, రెండు ఉపాద్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని టీడీపీ చూస్తున్నది. ఇందులో భాగంగా వామపక్షాలతో కలిసి అడుగులు వేయాలని నిర్ణయించింది. టీడీపీ పట్టభద్రుల స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఉపాద్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయకుండా వామపక్షాల అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని న...
ఏపీలో పీఆర్సీతో(PRC)పాటు పలు అంశాల పరిష్కారం కోసం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా APJAC నిరసనలు చేపట్టనుంది. సీఎం జగన్(CM JAGAN) ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈరోజు మూడు ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి ప్రభుత్వం అత్యవసరంగా చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో చర్చలు సఫలం అవుతాయే లేదో చూడాలి.
మంత్రి రోజా టూరిస్టా లేక టూరిజం మినిస్టరా అని తనను ఎగతాళి చేసిన వారికి ఇదే తన సమాధానం అని, విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా టూరిజంలో రూ.21,941 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 129 ఎంవోయూలు జరిగాయని మంత్రి రోజా చెప్పారు.
మహిళ(women) లేదా స్త్రీ లేకుండా అసలు ఓ కుటుంబం ఉండదనే చెప్పవచ్చు. అంతేకాదు తల్లి లేకుండా సృష్టే లేదని చెబుతుంటారు. అలాంటి మహిళల గుర్తింపును తెలియజేసేందుకు ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను(international women's day) ఐక్యరాస్య సమితి నిర్వహిస్తుంది.
జనసేన(Janasena) అమ్ముడుపోయే సేన అని, హైదరాబాద్ లో వేలం పాట పెట్టేశారని మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కామెంట్స్ చేశారు. ఏపీలోని పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జనసేన(Janasena) వేలంపాటలో చాలా మంది పాల్గొన్నారన్నారు. బీఆర్ఎస్(BRS) పాడుకుంటుందో, చంద్రబాబు పాడుకుంటాడో లేకపోతే బీజేపీ(BJP) పాడుకుంటుందో, ఎవరు ...
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ (Good news) చెప్పింది. మార్చి 31 లోగా బకాయిలన్నీ చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్ , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, (Sajjala ramakrisha) వివిధ ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు.
యువతలో గుండెపోటు(Heart Attack) ఘటనలు గుబులు పుట్టిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు(Heart Attack)కు గురై మరణిస్తున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. తాజాగా ఓ యువకుడు గుండెపోటుతో ప్రాణాలు విడిచిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. అతి చిన్న వయసులో 19 ఏళ్లకే ఆ యువకుడికి గుండెపోటు(Heart Attack) వచ్చింది. స్నేహితులతో ఆడుతూ ఉండగానే ఆ యువకుడికి గుండెపోటు వచ్చింది.
Achennaidu : ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు..చాలా రాజకీయ పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచుతూ ఉంటాయి. ఇది చాలా కామన్ గా జరిగే విషయమే. అయితే... ఈ విషయంపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు తాజాగా చేసిన కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. డబ్బులు ఏ పార్టీ పంచినా తీసుకోవాలి అంటూ ఓటర్లకు ఆయన చెప్పడం గమనార్హం.
mother tiger:పులి (tiger) పిల్లలు కనిపిస్తే అంతే సంగతులు.. ఒకటి కాదు రెండు కాదు నాలుగు పులి (tiger) పిల్లలు కనిపించాయి. వాటి తల్లిని అటవీ అధికారులు గుర్తించారు. నాలుగు పులి పిల్లల తల్లి పులి నంద్యాల (nandyala) జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం బీట్ పరిధిలోని 108వ పులి అని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. తల్లి పులి ఎక్కడ ఉందనేది ఇంకా తెలియలేదు. దాని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Lokesh : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాదయాత్ర పీలేరులో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం నుంచి 37వ రోజు యువగళం పాదయాత్ర ను లోకేష్ ప్రారంభించారు.
ఓ స్కూల్లో చిన్నారులు సామి.. సామి.. పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మూడు రోజుల క్రితం దీనిని ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, 2వేలకు పైగా లైక్స్ వచ్చాయి. వేలాది మంది చూశారు.
Till now elections in AP:ఆంధ్రప్రదేశ్‌లో (andhra pradesh) ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది. ఇదే అంశంపై తెలుగు360 (telugu360) ట్విట్టర్‌లో ఓ సర్వే రిపోర్ట్‌ను (survey report) షేర్ చేసింది. ఆ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ (tdp) 91 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతుందని పేర్కొంది.
ఏపీ(AP)లో వచ్చే విద్యా సంవత్సరానికి గాను అన్ని ప్రైవేటు స్కూళ్ల(private schools)లో 25 శాతం(25 percentage) సీట్లు పేదలకు కల్పించనున్నట్లు విద్యాశాఖ నిర్ణయించినట్లు వెల్లడించింది. అందుకోసం మార్చి 18 నుంచి అప్లై చేసుకోవాలని అధికారులు ప్రకటించారు.
Vellampally Srinivas : విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విజయవంతమైందని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైజాగ్ లో అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో ఎంతో ఘనంగా జరిగిందన్నారు. ఈ సమ్మిట్ తో ఆంధ్రప్రదేశ్ కి భారీ పెట్టుబడులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
స్పూఫింగ్(spoofing) ద్వారా పలువురు దుండగులు మనకు తెలియకుండానే డేటా(data)ను సేకరించడం లేదా మన ఫోన్(phone) లేదా కంప్యూటర్లను(computers) రి ఆధీనంలోకి తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో స్పూఫింగ్ అనేది భద్రత, గోప్యతకు తీవ్రమైన ముప్పుగా మారిపోయింది. ఈ క్రమంలో పలు రకాల దాడుల(cyber attacks) గురించి తెలుసుకోవడం, అందుకు తగిన నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.