»Mother Tiger Is Pedda Gummadapuram Beat Circle 108
mother tiger ఇదే.. పెద్ద గుమ్మడాపురం బీట్ పరిధిలోని 108వ పులి
mother tiger:పులి (tiger) పిల్లలు కనిపిస్తే అంతే సంగతులు.. ఒకటి కాదు రెండు కాదు నాలుగు పులి (tiger) పిల్లలు కనిపించాయి. వాటి తల్లిని అటవీ అధికారులు గుర్తించారు. నాలుగు పులి పిల్లల తల్లి పులి నంద్యాల (nandyala) జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం బీట్ పరిధిలోని 108వ పులి అని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. తల్లి పులి ఎక్కడ ఉందనేది ఇంకా తెలియలేదు. దాని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
mother tiger is pedda gummadapuram beat circle 108
mother tiger:పులి (tiger) పిల్లలు కనిపిస్తే అంతే సంగతులు.. ఒకటి కాదు రెండు కాదు నాలుగు పులి (tiger) పిల్లలు కనిపించాయి. వాటి తల్లిని అటవీ అధికారులు గుర్తించారు. నాలుగు పులి పిల్లల తల్లి పులి నంద్యాల (nandyala) జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం బీట్ పరిధిలోని 108వ పులి అని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. తల్లి పులి ఎక్కడ ఉందనేది ఇంకా తెలియలేదు. దాని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఆ ఆడ పులి పిల్లలు మాత్రం అటవీ శాఖ అధికారుల సంరక్షణలో క్షేమంగా ఉన్నాయి.
తల్లి పులి వయస్సు 8 సంవత్సరాలు (8 years) ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. పులి పిల్లలు (tiger) లభించిన చోట దాని తల్లి (tiger) అరుపులు విన్నామని సిబ్బంది వెల్లడించారు. పిల్లలకు దూరమైన తల్లి పులి ఉద్రేకంగా ఉంటుందని.. జాగ్రత్తగా అంచనా వేస్తున్నామని వివరించారు. ఒకేసారి నాలుగు పిల్లలకు పులి (tiger) జన్మనివ్వడం దేశ చరిత్రలో అరుదు అని చెబుతున్నారు. తల్లి పులి కోసం ప్రత్యేక ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని వివరించారు. సాధ్యమైనంత త్వరగా తల్లి వద్దకు పులి (tiger) పిల్లలను చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
దూరమైన పిల్లలను తల్లి పులి చేరదీస్తుందో లేదో చూసి, పీసీసీఎఫ్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనపై అటవీ శాఖ అధికారులు, స్వచంద సంస్థలతో కమిటీ వేశామని తెలిపారు. తల్లి పులి (tiger) జాడ లేకపోతే రెండేళ్లు సంరక్షించి అటవీ ప్రాంతంలో వదిలేస్తామని నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి (srinivas reddy) వెల్లడించారు.
పెద్దగుమ్మడాపురంలో పెద్దపులి (tiger) పిల్లలు కనిపించడంతో కలకలం రేగింది. ఆదివారం ఉదయం పూట ఓ యువకుడు గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చాడు. 4 పులి (tiger) పిల్లలు కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులకు (forest officials) సమాచారం ఇవ్వడంతో వాటిని తీసుకెళ్లారు. తల్లి పులి జాడ కోసం అన్వేషిస్తున్నారు. కానీ స్థానికులు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. పిల్లలు దూరమైన తల్లి పులి కోపంతో ఉంటుందని.. కేర్ ఫుల్గా ఉండాలని చెబుతున్నారు.