»Free Admission For 25 Percentage Of Poor Students In Ap Private Schools
AP Private Schools:లలో పేదలకు ఉచితంగా అడ్మిషన్లు!
ఏపీ(AP)లో వచ్చే విద్యా సంవత్సరానికి గాను అన్ని ప్రైవేటు స్కూళ్ల(private schools)లో 25 శాతం(25 percentage) సీట్లు పేదలకు కల్పించనున్నట్లు విద్యాశాఖ నిర్ణయించినట్లు వెల్లడించింది. అందుకోసం మార్చి 18 నుంచి అప్లై చేసుకోవాలని అధికారులు ప్రకటించారు.
ఏపీ(AP)లో వచ్చే ఏడాది 2023-24 విద్యా సంవత్సరానికి అన్ని ప్రైవేటు స్కూళ్ల(private schools)లో 25% సీట్లను(25 percentage) పేదలకు కల్పిస్తామని విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలిపింది. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఈ మేరకు ఒక ప్రకటనను జారీ చేశారు. ఈ క్రమంలో అనాథలు, ప్రత్యేక వికలాంగులు, హెచ్ఐవీ బాధితుల పిల్లల కోసం (5%), SC కమ్యూనిటీ వారికి (10%), ST కమ్యూనిటీకి చెందిన పిల్లలకు(4%), BCలు, మైనారిటీలు, OCలలో ఆర్థికంగా బలహీన వర్గాల వారి పిల్లలకు (6%) సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.
విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 12 (1)(సీ) ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా(ap state) ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో సామాజికంగా, ఆర్థికంగా బలహీన వర్గాల పిల్లలకు విద్యా శాఖ 25% రిజర్వేషన్ను అందిస్తుంది. అయితే అందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల వార్షిక ఆదాయం(family annual income) 1,22,000 లక్షల కంటే తక్కువ, పట్టణ ప్రాంతాల్లో 1,44,000 కంటే తక్కువ వార్షిక ఆదాయం కలిగిన వర్గాల తల్లిదండ్రుల(parents) పిల్లలు(students) అడ్మిషన్లకు అర్హులుగా పేర్కొన్నారు.
అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో(private schools) 25% సీట్లు పేదలకు రిజర్వ్ చేయడం తప్పనిసరి అని ఏప్రిల్ 12, 2012న సుప్రీకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యా హక్కు చట్టం 2009లోని నిబంధన రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీంకోర్టు(supreme court) సమర్థించింది. ఆర్థికంగా బలహీనమైన వారు, వెనుకబడిన వర్గానికి చెందిన పిల్లల కోసం 25 శాతం సీట్లను కేటాయించాలని తెలిపింది.
ఆన్ లైన్(online) పోర్టల్లో(portal) అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్ల నమోదు తేదీలు: మార్చి 6 నుంచి మార్చి 16, 2023
విద్యార్థులు అప్లై చేసుకునేందుకు: మార్చి 18 నుంచి ఏప్రిల్ 7 వరకు
ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లలో ప్రవేశానికి ఎంపిక : ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 12 వరకు
మొదటి ఎంపిక(first list) జాబితా విడుదల : ఏప్రిల్ 13, 2023
రెండో ఎంపిక జాబితా(second list) విడుదల : ఏప్రిల్ 25, 2023