విక్టరీ హీరో వెంకటేష్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన బాబాయ్ దగ్గుబాటి మోహన్ బాబు కన్నుమూశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కాలు బెణికింది. ఈ రోజు ఉదయం వ్యాయామం చేసే సమయంలో కాలు బెణికిందని సీఎంవో ట్వీట్ చేసింది.
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర అనంతపురం నియోజకవర్గంలోకి కొనసాగుతోంది. సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో వైసీపీ అక్రమాలు శ్రుతి మించాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి(Somireddy Chandramohan Reddy) అన్నారు. కర్నూలు జిల్లాలో ఇసుక తవ్వకాలకు అనుమతి తీసుకుని నెల్లూరు(nellore)లో తవ్వకాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో గనుల లీజు పొందిన వారిపై కోట్ల రూపాయల పెనాల్టీ వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఇలా గత మూడేళ్లకు వైసీపీ నేతల ఆధ్వర్యంలో మూడే వేల క...
మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో తెలంగాణ హైకోర్టు ఏపీ సీఐడీకి కీలక ఆదేశాలు జారీచేసింది. మార్గదర్శికి చెందిన 30 మంది మేనేజర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంచేసింది.
వైఎస్ వివేకా హత్య కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ భాస్కర్ రెడ్డి మరో పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసులో ఏ-4గా ఉన్న దస్తగిరిని సీబీఐ అఫ్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాల్ చేశాడు.
MLA Ramakrishna : వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ పార్టీ మారుతున్నారంటూ ఇటీవల ప్రచారం మొదలైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆర్కే హాజరు కాకపోవడంతో... ఆయన పార్టీ వీడుతున్నారంటూ వార్తలు రావడం మొదలయ్యాయి.
కాన్ఫరెన్స్ హాల్ లో సిబ్బంది సినిమా పాటలకు డ్యాన్స్ లు చేస్తూ రచ్చరచ్చ చేశారు. క్లబ్ లు.. పబ్ ల్లో మాదిరి స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రికార్డింగ్ డ్యాన్స్ లు మాదిరి చేయడం తీవ్ర దుమారం రేపుతున్నది.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ వ్యాఖ్యలు
Mekapati : పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత... మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి... రాజకీయంగా మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన .. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కలిశారు. కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు.
డబ్బులు తీసుకున్న వారికి సంస్కారం లేకుంటే ఎలా అంటూ డ్వాక్రా మహిళల పైన ఒకింత అసహనం వ్యక్తం చేసారు మంత్రి ధర్మాన ప్రసాద రావు.
వల్లభనేని వంశీ, కొడాలి నాని పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. ఇదే వల్లభనేని వంశీ స్పందించారు. నాని, తాను పార్టీ మారడం లేదని తేల్చిచెప్పారు.
ఏలూరు జిల్లా దెందులూరు వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారి పైన ఓ ప్రయివేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పదకొండు మంది గాయపడ్డారు.
Jogi Ramesh : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తన పార్టీ ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం విదితమే. ఈ సమావేశంలో జగన్..... ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కొందరికి జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవాలని హితబోధ చేసినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ నేతలతో కలుస్తూ, పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం మురళీధర రావుతో భేటీ అనంతరం పవన్ ను మీడియా ప్రశ్నించగా.. ఇంకా పలువురు నేతలను కలవాల్సి ఉందని, అందరినీ కలిశాక మాట్లాడుతానని చెప్పారు.