»Nri Arrested In Andhra Pradesh For Post On Ys Jagan
NRI arrest: జగన్కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఎన్నారై అరెస్ట్!
జగన్, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఓ ఎన్నారైని గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని గురువారం సాయంత్రం జడ్జి ఎదుట హజరు పరచగా, రిమాండ్ విధించేందుకు నిరాకరించారు.
NRI arrest: జగన్కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఎన్నారై అరెస్ట్!
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (chief minister of andhra pradesh ys jagan), వైసీపీ ప్రభుత్వం (ycp government), పార్టీ పైన (ycp) సోషల్ మీడియాలో పోస్టులు (Social Media Posts) పెట్టారన్న ఆరోపణలపై ఓ ఎన్నారైని (NRI arrest) అరెస్టు చేశారు పోలీసులు. ఎన్నారై పొందూరు కోటిరత్న అంజన్ ను కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు (Krishna District Gannavaram Police) బుధవారం ఉదయం అరెస్ట్ చేసి, గురువారం సాయంత్రం అదనపు జూనియర్ సివిల్ జడ్జి శిరీష ఎదుట హాజరుపరిచారు. నిందితుడు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా, రెండు వర్గాల మధ్య శతృత్వం పెంచేలా సోషల్ మీడియాలో (Social Media) అసభ్యకర పెడుతున్నారని, రిమాండ్ విధించాలని పోలీసులు న్యాయమూర్తిని కోరారు. ఈ కేసులో రిమాండ్ అవసరం లేదని, నోటీసులు ఇస్తే సరిపోతుందని నిందితుడి తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం రిమాండ్ విధించేందుకు నిరాకరించిన న్యాయమూర్తి… ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
కోటిరత్నం అంజన్ అమెరికాలో (America) ఎంఎస్ చదివి, అక్కడే ఉద్యోగం చేసి తిరిగి వచ్చారు. తల్లిదండ్రులు గన్నవరంలో ఉంటున్నారు. అంజన్ కొంతకాలంగా యువగళం అనే ట్విట్టర్ ఖాతా (Yuva Galam Twitter Account) ద్వారా టీడీపీకి అనుకూలంగా, వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. స్థానిక వైసీపీ కార్యకర్త ప్రశాంత్ ఈ అంశంపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 153ఏ కింద కేసు నమోదు చేశారు. అంజన్ ను అదుపులోకి తీసుకొని ఫోన్, ల్యాప్ టాప్, ట్యాబ్ ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోస్టులు పెట్టమని ఎవరైనా ప్రోత్సహించారా అనే కోణంలో ప్రశ్నించారు. టీడీపీ నుండి డబ్బులు అందుతున్నాయా అని ప్రశ్నించారు. అయితే తాను వ్యక్తిగతంగానే పోస్టులు పెట్టానని చెప్పారు. తర్వాత ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టవద్దని కౌన్సిలింగ్ ఇచ్చి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరు పరిచారు. స్టేషన్ బెయిల్ పైన విడుదల చేశారు.