Lakshmi Parvathi : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ , ఆయన అల్లుడు , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫై తెలుగు సంస్కృతం అకాడమీ ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతీ సెటైర్స్ విసిరారు .. తిరుపతిలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు ..
చంద్రబాబు పాపాలు రోజు రోజుకీ పండుతున్నాయని వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె… లోకేష్, చంద్రబాబులపై విమర్శల వర్షం కురిపించారు. లోకేష్ దేనికీ పనికి రాని దద్దమ్మ అంటూ ఎద్దేవా చేశారు. ఒక్క చోట కూడా గెలవని వ్యక్తి, సీఎం జగన్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను చెప్పలేక బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. మంగళవారం మీడియాతో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. లోకేశ్ పాదయాత్రలో రోజుకో కామెడీ బాగుందంటూ ఎద్దేవా చేశారు.
ఏపీలో ప్రతిపక్ష పార్టీ రోజు రోజుకు దిగజారి పోతోందన్నారు. అమరావతిలో ఇన్సైడర్ పేరుతో మోసాలు చేశారని, పోలవరం పేరుతో మోసాలు చేశారని ఆరోపించారు. సోషల్ మీడియాలో పనికి మాలిన వెధవల్ని, కుక్కల్ని పోషిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు సైకో అని, ఆయన పాపాలు పండిపోయాయని లక్ష్మీ పార్వతి అన్నారు. దుబాయ్, స్విట్జర్లాండ్ లో చంద్రబాబు రూ.ఐదు లక్షల కోట్లు దాచి పెట్టారని ఆరోపించారు. ప్రధాని మోడీ ఈ నల్లధనం బయటకు తెప్పించి, స్వదేశానికి రప్పించాలని కోరారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఏమి మాట్లాడతారోనని లక్ష్మీపార్వతి సెటైర్ వేశారు. ఆయన మాట్లాడి ఆరునెలలు దాటినా అర్థం కాదన్నారు.