Bjp will work Country buildup, Eradication of poverty:Kiran Kumar reddy
నీళ్ల సీసా కింద పడకముందే జాగ్రత్తపడాలని, కింద పడి పగిలిన తర్వాత నీళ్లను సీసాలో పోయలేమని సమైక్యాంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు (kiran kumar reddy). కాంగ్రెస్ పార్టీ (congress party) బలహీనపడుతోందనే కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. తాను పదవులు ఆశించి బీజేపీలో (bjp) చేరలేదని, బీజేపీ ప్రాథమిక సభ్యత్వం ఆశించి… ప్రజలకు మేలు చేయవచ్చనే ఉద్దేశ్యంతోనే చేరినట్లు చెప్పారు. తన సేవలు పార్టీకి ఎక్కడ అవసరమైతే అక్కడ పని చేసేందుకు తాను సిద్ధమని చెప్పారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో (vijayawada bjp office) నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిష్టానం అస్తవ్యస్థ నిర్ణయాలతో కాంగ్రెస్ (congess) బాగా దెబ్బతిన్నదని, ఒక్కో రాష్ట్రంలో బలహీనపడుతోందన్నారు. తనకు ఏపీలో పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తానని చెప్పారని, కానీ లేని పార్టీ ఎందుకని, అందుకే వద్దని చెప్పానన్నారు. నీళ్ల సీసా కింద పడకముందే జాగ్రత్త పడాల్సిందని కాంగ్రెస్ కనుమరుగు అవుతోందని అభిప్రాయపడ్డారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి ప్రభుత్వం కంటే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం (nda government) తెలుగు రాష్ట్రాలకు (telugu states) ఎంతో సాయం అందిస్తోందన్నారు. ఏపీకి అవసరమైన నిధులను (funds to andhra pradesh) తీసుకు వస్తామని, ఏ ప్రభుత్వం అయినా రాజ్యాంగానికి లోబడి పని చేయవలసి ఉంటుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు… ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ నావే అన్నారు. తాను హైదరాబాద్ లో (hyderabad) పుట్టానని, అక్కడే చదువుకున్నానని, అక్కడ నివాసం కూడా ఉంటున్నట్లు చెప్పారు. అలాగే తన తండ్రి సొంతురూ చిత్తూరు జిల్లా అని గుర్తు చేసుకున్నారు. ఆయన వాయల్పాడు నుండి ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పారు. బెంగళూరులోను (bengaluru) తనకు ఇల్లు ఉందని, కర్నాటక కూడా తన స్వస్థలం అనవచ్చునని, పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పని చేస్తానన్నారు. కష్టపడి పని చేస్తే పదవులు అవే వస్తాయన్నారు. పదవుల గురించి తాను మాట్లాడి పార్టీలోకి రాలేదన్నారు. కనీసం ఎన్నికల్లో టిక్కెట్ గురించి కూడా అడగలేదని, ఆశించడం లేదన్నారు. తాను పోటీ చేసే అంశంపై తుది నిర్ణయం పార్టీదే అన్నారు.
రాజధాని (andhra pradesh capital) అంశంపై పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. పార్టీ బలోపేతానికి అన్ని విధాలుగా సిద్ధమని చెప్పారు. తన తమ్ముడు నిర్ణయం తనదే అని, తన నిర్ణయం తనదే అన్నారు. తన తమ్ముడు టీడీపీలో చేరినప్పటి నుండి తాను సొంతింటికి పోలేదని, గెస్ట్ హౌస్ లో ఇల్లు కట్టుకుంటున్నట్లు చెప్పారు. తమది ఉమ్మడి కుటుంబమేనని, కానీ రాజకీయపరంగా ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నారన్నారు. పార్టీలో పదవులు.. వివిధ అంశాలపై మీ అభిప్రాయం ఏమిటి అని మీడియా ప్రతినిధులు పదేపదే ప్రశ్నించగా… బీజేపీ పార్టీ ఏ నిర్ణయాలు తీసుకుంటే నా నిర్ణయాలు అవే అని కుండబద్దలు కొట్టారు. తాను ప్రాథమిక సభ్యత్వం కోసమే చేరానన్నారు.