JC Diwakar Reddy: పాదయాత్రలు జనాలు పట్టించుకోవడం లేదు
పాదయాత్రలపై జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు మన తెలుగు రాజకీయాల్లో పాదయాత్రలు కీలక పాత్ర పోషిస్తాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ వీరంతా పాదయాత్ర లు చేసిన తర్వాత.. సీఎం పదవి దక్కించుకున్నవారే.
పాదయాత్రలపై జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు మన తెలుగు రాజకీయాల్లో పాదయాత్రలు కీలక పాత్ర పోషిస్తాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ వీరంతా పాదయాత్ర లు చేసిన తర్వాత.. సీఎం పదవి దక్కించుకున్నవారే. ప్రస్తుతం లోకేష్, షర్మిల, రేవంత్ రెడ్డి ఇలా చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో యాత్రలు కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీరు ప్రజల్లోకి అడుగుపెట్టారు. అయితే… ఈ పాదయాత్రలపై టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం పాదయాత్రలకు కాలం చెల్లిందని జేసీ అన్నారు. పాదయాత్రలను జనాలు పట్టించుకోవడం లేదని కొట్టిపారేశారు. ఇప్పుడు ఎవరు పాదయాత్రలు చేసినా లాభం లేదన్నారు. గతంలో పాదయాత్రలు వేరు.. ఇప్పుడు వేరని వ్యాఖ్యానించారు. ఇప్పుడన్నీ డబ్బుతో కూడుకున్న యాత్రలని విమర్శించారు.
అయితే… ఇప్పుడు పాదయాత్రలపై ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తమ పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ కూడా పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయన చేసిన ఈ కామెంట్స్ .. పార్టీకి చేటు తెచ్చేలా కనపడుతున్నాయి. వీటిని అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా ఎలా మార్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.