ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. ప్రస్తుతం జగన్… కడప జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. కమలాపురం నియోజకవర్గంలో రూ.900 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం కమలాపురం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అని అనడంలేదని, ఇదే నా రాష్ట్రం ఇక్కడే నా రాజకీయం అని అన్నారు. చంద్రబాబులాగా ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం అని మాట్లాడను. దత్తపుత్రుడి లాగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని నేను అనడం లేదని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేను ఏపీలోనే ఉంటానన్న జగన్ ఈ ఐదు కోట్ల ప్రజలనే నా కుటుంబమని అన్నారు. ఇక్కడి ప్రజల ఇంటింటి సంతోషమే నా విధానమని పేర్కొన్నారు. రాజకీయ నాయకుడికి విశ్వసనీయత చాలా ముఖ్యం. ఇదే నా రాష్ట్రం, ఇదే నా కుటుంబం. ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ విధానం. చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమని నేను అనను. ఈ పార్టీ కాకపోతే, మరో పార్టీ అని నేను అనడం లేదని సీఎం జగన్ అన్నారు.