janasena party alliance with bjp in telangana assembly elections 2023
ఏపీలో విద్యుత్ రంగ ఉద్యోగుల్లో (Electricity workers) అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తమ సమస్యలపై విద్యుత్ సంస్థల యాజమాన్యంతో జేఏసీ (JAC) చర్చలు జరిపింది. అయితే ఈ చర్చల్లో విఫలం చవిచూసింది. చర్చలు విఫలమైన తరుణంలో జేఏసీ నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు తెలిపింది. ఆగస్టు 10వ తేది నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్టు జేఏసీ ప్రకటించింది. అంతేకాకుండా ఆందోళనలు కూడా చేపట్టనున్నట్లు పిలుపునిచ్చింది. ఆగస్టు 8న విజయవాడలోని విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ ఉద్యోగులు మహాధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ ధర్నాకు విద్యుత్ ఉద్యోగులు భారీగా తరలి రావాలని జేఏసీ కోరింది.