»Gvl Narasimha Rao Mentioned Vangaveeti Mohana Ranga In Rajya Sabha
విజయవాడ ఎయిర్ పోర్టుకు Vangaveeti Ranga పేరు పెట్టాలి
ఆయన మా వ్యక్తి.. మావోడు అంటూ ఆయా రాజకీయ పార్టీలు అతడి క్రేజ్ ను, ఆయన వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు అష్ట కష్టాలు పడుతుంటాయి. రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలోనే అతడిని ప్రత్యర్థులు మట్టుబెట్టారు. కానీ ఆయనను ప్రజలు ఇంకా ఆరాధిస్తున్నారు. అలాంటి వ్యక్తి పేరు తాజాగా ఢిల్లీ గడ్డపై వినిపించింది. పార్లమెంట్ లో అతడి ప్రస్తావన వచ్చింది. ఏపీలో ఒక జిల్లాకు లేదా విజయవాడ విమానాశ్రయానికి అతడి పేరు పెట్టాలనే సరికొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.
ఏపీలో ఒకప్పటి కీలక నాయకుడు. విజయవాడ (Vijayawada)ను హడలెత్తించిన వ్యక్తి ఆయన. రౌడీయిజమైనా.. రాజకీయమైనా ఆయన స్టైలే వేరు. అందుకే ఆయన దివికేగి దశాబ్దాలు దాటినా యువతకు ఐకాన్ గా నిలుస్తున్నాడు. ఆయన మా వ్యక్తి.. మావోడు అంటూ ఆయా రాజకీయ పార్టీలు అతడి క్రేజ్ ను, ఆయన వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు అష్ట కష్టాలు పడుతుంటాయి. రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలోనే అతడిని ప్రత్యర్థులు మట్టుబెట్టారు. కానీ ఆయనను ప్రజలు ఇంకా ఆరాధిస్తున్నారు. అలాంటి వ్యక్తి పేరు తాజాగా ఢిల్లీ గడ్డపై వినిపించింది. పార్లమెంట్ లో అతడి ప్రస్తావన వచ్చింది. ఏపీలో ఒక జిల్లాకు లేదా విజయవాడ విమానాశ్రయానికి అతడి పేరు పెట్టాలనే సరికొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆ డిమాండ్ చేసింది ఎవరో కాదు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao). ఆయన పెట్టాలని కోరిన పేరు వంగావీటి మోహన రంగ (Vangaveeti Mohana Ranga).
చదవండి:KCR రాజీనామా చేయ్.. డేట్, టైమ్ ఫిక్స్ చేయ్: బండి సంజయ్
ప్రజల ఆరాధ్య దైవం
విజయవాడలో వంగవీటి రంగ ప్రజలకు సేవ చేశారు. ఆయన సేవలను కీర్తిస్తూ ఏపీలో ఒక జిల్లాకు లేదా.. విజయవాడలోని విమానాశ్రయానికి (Airport) పేరు పెట్టాలని జీవీఎల్ నరసింహా రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యసభ (Rajya Sabha)లో జీరో అవర్ (Zero Hour)లో ఈ సరికొత్త డిమాండ్ ను చేశారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యసభలో ఇలా మాట్లాడారు.. ‘వంగవీటి మోహన్ రంగ ఏపీలో తెలియని వారు లేరు. పేదలు, బడుగుల బలహీనవర్గాలకు ఆరాధ్య దైవంగా ఏపీ ప్రజలు భావిస్తారు. కీలకమైన కాపు (Kapu) సామాజికవర్గానికి చెందిన మోహన్ రంగ కేవలం ఒక్కసారే ఎమ్మెల్యేగా గెలిచారు. రెండున్నరేళ్ల పదవీకాలంలోనే గొప్ప ప్రజా నాయకుడిగా పేరు పొందారు. 1986 డిసెంబర్ లో రంగాను కొందరు ద్రోహులు హతమార్చారు. ఆయన రాజకీయ శక్తిగా ఎదుగుతున్న తరుణంలో ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందుతున్నాడు. కాపునాడు సభలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమయంలోనే హత్యకు గురయ్యారు. అనేక మంది పేదలు, కాపు ప్రజలు వచ్చి ఆయనను సమర్ధించిన సమయంలోనే హత్య జరిగింది. ఈ హత్య చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది’ అని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు
‘రంగా చనిపోయి 36 సంవత్సరాలు గడిచాయి. అయినా ప్రజలు ఆయనను మరచిపోలేదు. అందుకే వంగవీటి మోహన్ రంగా పేరుతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రస్తావన విస్తృతంగా ఉంది. దురదృష్టవశాత్తు అదీ జరగలేదు. రాష్ట్రంలో ఇతర నాయకుల పేర్లతో జిల్లాలు పెట్టారు కానీ, వంగవీటి రంగా పేరు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎందుకు మనసు ఒప్పలేదో? అలాంటి మహా వ్యక్తిని గుర్తు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి. కృష్ణ, మచిలీపట్నం జిల్లాల్లో ఒకదానికి వంగవీటి రంగ పేరు పెట్టాలి. ఇక విజయవాడ అంతర్జాతీయ విమనాశ్రాయానికి రంగా పేరు పెట్టాలని పౌర విమనాయాన శాఖ మంత్రికి విన్నవిస్తున్నా’ అని జీవీఎల్ నరసింహా రావు ప్రసంగం ముగించారు. అకస్మాత్తుగా ఆయన రంగ పేరు మీద డిమాండ్ చేయడం ఏపీలో ఆసక్తికరంగా మారింది.