»Federation Cup Athletics Jyothi Yarraji Wins Second Gold In 200m
Jyothi Yarraji: ఈ జ్యోతి నిజమైన బంగారం..!
రాంచీలో జరుగుతున్న ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చివరి రోజున ఏపీకి చెందిన జ్యోతి యర్రాజీ(Jyothi Yarraji) రెండో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల 200 మీటర్ల పరుగు పందెంలో జ్యోతి తన అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
26వ జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల 100 మీటర్ల హర్డిల్స్ స్పెషలిస్ట్ జ్యోతి యర్రాజీ(Jyothi Yarraji)వరుసగా రెండో రోజు గురువారం ఇక్కడ జరిగిన మహిళల 200 మీటర్ల పరుగులో బంగారు పతకాన్ని సాధించింది.
స్టార్ అథ్లెట్ జ్యోతి యర్రాజి ఫెడరేషన్ కప్‌లో మరో స్వర్ణం గెలిచింది. ఆమె ఖాతాలో ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఆమె రెండు స్వర్ణాలు గెలుచుకోవడం విశేషం.
రెండు రోజుల క్రితం మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి నెగ్గిన జ్యోతి.. మహిళల 200 మీటర్ల రేసులో అగ్రస్థానంలో నిలిచింది. గురువారం జరిగిన పోటీలో జ్యోతి 23.42 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి పతకం కైవసం చేసుకుంది.
ఇది కూడా చూడండి: Minister Roja:కు గట్టి షాక్..తమిళనాడులో వింత ఎక్స్ ప్రేషన్ తో
ఈ ప్రదర్శనతో తెలుగమ్మాయి ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ మార్క్ (23.50 సెకన్లు)ను అధిగమించింది. ఈ రేసులో జ్యోతి దేశంలోని మేటి 200 మీటర్ల పరుగు అథ్లెట్లను ఓడించి మరీ పసిడిని సాధించింది.
ఈ రేసులో అర్చన (23.61 సె. తమిళనాడు) రజత పతకం చేజిక్కించుకుంది. జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ అథ్లెట్.. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలోనూ ఇదే జోరు కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది.