సత్యసాయి: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలతో వినతి పత్రాలు స్వీకరిస్తామని తెలిపారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరిస్తామని చెప్పారు.