కడప: న్యూ ఇయర్ వేడుకలను కుటుంబసభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని కడప వన్ టౌన్ సీఐ రామకృష్ణ ప్రజలకు సూచించారు. రేపు రాత్రి 9గంటల నుంచి కడప నగరంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆంక్షలను కఠినతరం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. బహిరంగంగా డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.