NLR: వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి బుధవారం తన నివాసంలో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన నీటి సంఘం అధ్యక్షులు ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపై సమీక్షించారు. పలు అంశాలను నేదురుమల్లి దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.