కృష్ణా: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీ.ఆర్క్) కోర్స్ 5వ ఏడాది చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 7, 9 తేదీలలో ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయని పరీక్షల విభాగ కంట్రోలర్ ఏ.శివప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు.