ప్రకాశం: గిద్దలూరు కోర్టు ప్రాంగణంలో బాల్య వివాహాలను అరికట్టడంపై మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఓంకార్ హాజరయ్యారు. బాల్య వివాహాలను అరికట్టడం సమాజంలోని ప్రతి పౌరుని బాధ్యత అని పేర్కొన్నారు. చట్టప్రకారం బాల్య వివాహం నేరమని ఆయన పేర్కొన్నారు.