KRNL: చిప్పగిరి మండలం పెన్నఅహోబిలం లక్ష్మీ నరసింహస్వామిని ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆదివారం దర్శించుకున్నారు. స్థానిక మండల నాయకులతో కలిసి దర్శనార్థం కోసం వచ్చిన ఆయనకు ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పూజారులు ప్రత్యేక పూజలు చేసి, వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.