EG: సీతానగరం మండలం కూనవరం మిత్తిపాడు గ్రామపంచాయతీ పరిధి ట్రైనీ ఎస్సై సురేష్ బాబు ఆధ్వర్యంలో పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఆదివారం రాత్రి 10 గంటలకు కూనవరంలో నలుగురుని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 2600, అలాగే మిత్తిపాడులో ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.9,900 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.