NTR: పెనుగంచిప్రోలులో కార్తీక మాసం సందర్భంగా శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో రెండవ ఆదివారం ప్రత్యేక వైభవం నెలకొంది. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. ఈ సందర్భంలో శ్రీ అమ్మవారు పసుపు కొమ్ములతో అద్భుతమైన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు, హారతులతో ఆలయం మార్మోగింది. అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించేందుకు భక్తులు తరలివచ్చారు.