AKP: నర్సీపట్నం మండలంలో శనివారం నవోదయ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లా పరిషత్ హై స్కూల్ మెయిన్, జడ్పీ గర్ల్స్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్ మూడు పరీక్షా కేంద్రాలు కేటాయించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష కొనసాగింది. మండలంలో 624 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 487 మంది పరీక్ష రాశారని ఎంఈవో తలుపులు తెలిపారు.