GNTR: తెనాలి యడ్ల లింగయ్య కాలనీలో నివసిస్తున్న 30 గిరిజన కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, రేషన్, ఆధార్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. దశాబ్దాలుగా వ్యర్థాలు సేకరిస్తూ జీవిస్తున్న ఈ పేదలకు ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు లేదని, అధికారులు స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు.