GNTR: కౌలు రైతులకు రుణాలు అందకపోవడం అనేది సామాజిక సమస్య అని గుంటూరు, కృష్ణా పట్టభధ్రుల MLC లక్ష్మణరావు శాసనమండలిలో అన్నారు. APలో 26 లక్షల మంది కౌలు రైతులున్నారని చెప్పారు. భూయజమాని సంతకం ఉంటేనే రుణ అర్హత కార్డులు ఇస్తామనే నిబంధనతో చాలామంది నష్టపోతున్నారని చెప్పారు. భూమి మీద యజమానికి, పంట మీద కౌలు రైతుకి రుణాలు ఇవ్వడం మంచిదని సూచించారు.