NLR: సంగం పట్టణంలోని శ్రీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆలయ ఆవరణలో అశ్వద్ధ నారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఈ కళ్యాణ కార్యక్రమానికి విచ్చేశారు. స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.