KRNL: ప్రపంచ సాహిత్యంలో సాటిలేని గ్రంథం భగవద్గీత అని, శోకమయమైన జీవునికి శాశ్వతమైన ఉపశమనం కలిగిస్తుందని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా శాఖ కార్యనిర్వాహకులు మల్లు వేంకటరెడ్డి అన్నారు. గూడూరు మండలం మల్లాపురం గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు ధార్మిక కార్యక్రమాలను ఆయన మంగళవారం ప్రారంభించారు.