MBNR: జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ఈ నెల 7వ తేదీన మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ విజయేంద్ర బోయి ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు, వయోవృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.