ప్రకాశం: మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రకాశం జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పరిశీలించారు. నూతన కార్యాలయంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మరో వారం పది రోజుల్లో పూర్తవుతాయన్నారు. అనంతరం ఇక్కడి నుంచి జిల్లా పరిపాలన మొదలవుతుందని తెలిపారు. ఇందులో భాగంగా సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, ఎమ్మార్వో చిరంజీవి తదితర అధికారులు పాల్గొన్నారు.