CTR: SDPI పార్టీ ఆధ్వర్యంలో నంద్యాలలో రేపు (గురువారం) జరిగే భారీ బహిరంగ సభకు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని పార్టీ జిల్లా నాయకుడు యూసుఫ్ తెలిపారు. ఇవాళ పుంగనూరులో ఆయన మాట్లాడుతూ ‘వక్ఫ్ రక్షణ సమాజ సంక్షేమం’ అనే నినాదంతో సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే పుంగనూరు నుండి వెళ్లేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.