ATP: నూతన సంవత్సర వేడుకలలో పోలీస్ నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చర్యలు తప్పవని కదిరి డీఎస్పీ శివన్నారాయణ స్వామి హెచ్చరించారు. ఆదివారం కదిరి పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ నారాయణ రెడ్డితో కలిసి డీఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నూతన సంవత్సరం సందర్భంగా వేడుకలకు రోడ్లపై అనుమతి లేదని కేక్ కటింగ్ చేయాలనుకునేవారు తమ ఇళ్లలోనే చేసుకోవాలని సూచించారు.