ప్రకాశం: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కమిటీలలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్‌కు చోటు లభించింది. పిఠాపురం నియోజకవర్గంలో జరగనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ కమిటీ సభ్యులుగా పార్టీ అధిష్టానం కంది రవి శంకర్‌ను నియమించింది. ఈ మేరకు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.