GMTR: తెనాలిలోని సుల్తానాబాద్, ఆలపాటి నగర్లలో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను శనివారం తొలగించారు. ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్ల కారణంగా తరచుగా వోల్టేజీ, విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీంతో ట్రాన్స్ ఫార్మర్లు కూడా మరమ్మతులకు గురవుతున్నాయి. స్థానికుల ఫిర్యాదుల మేరకు విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, ప్రత్యేక సిబ్బంది పనులు చేపట్టారు.