కృష్ణా: అవనిగడ్డలో జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం విద్యుత్ శాఖ అవనిగడ్డ డీఈఈ ఎన్ సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది అవగాహనా ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కలిగించారు. కార్యక్రమంలో ఏఈఈలు ఎస్.వీ.వీ సత్యనారాయణ, గోపీచంద్, జీవీ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.