KRNL: ఐదేళ్లు అభివృద్ధికి నోచుకోని రాష్ట్రాన్ని తమ ప్రభుత్వం వచ్చాక గాడిలో పెడుతోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఇందిరాగాంధీ నగర్లో ఆయన పర్యటించారు. ఇంటింటికీ ప్రభుత్వం అందించిన ఏడాది పాలన విజయాలను ప్రజలకు వివరించారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని ఆయన చెప్పారు.