ప్రకాశం: యర్రగొండపాలెం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని నిరుద్యోగులు గమనించి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.