Drunk Innova driver rammed 8 bikes in Andhra Pradesh
Viral News: తాగి వహనం నడపకూడదు అని పోలీసులు ఎన్ని విధాలుగా చెప్పినా వినేవాళ్లేరి. తాగడం, వాహనాలు నడపడం, ప్రమాదాలు చేయడం షరా మాములే అయిపోయింది. దొరికితే జైలుకు వెళ్తాము, ఫైన్ కట్టి బయటకోస్తామని మద్యం తాగినంత సింపుల్గా చెప్పేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో గల విశాఖపట్నం (Vishakapatnam)లో జరిగింది. మద్యం సేవించి ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఇష్టానుసారంగా వాహనం నడుపుతూ ఎదురొచ్చిన వాహానాలతో పాటు పార్క్ చేసిన వాహనాలను కూడా ఢీ(Collision) కొట్టాడు. మంగళవారం అర్థరాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు వివరించారు.
విశాఖపట్నంలో ఒకతను ఇన్నోవా(Innova)లో వీఐపీ రోడ్డుపై వేగంగా దూసుకెళ్లి గందరగోళం సృష్టించాడు. డ్రైవర్ మొదట రోడ్డుపై ఉన్న వాహనాలను, ఆ తరువాత పార్క్ చేసిన ఎనిమిది బైక్లను ధ్వంసం చేసి.. చివరికి చెట్టును ఢీ కొట్టాడు. వెంటనే డ్రైవర్ కారు దిగి పారిపోయినట్లు చెప్పారు. రాత్రి 11 గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందని.. అతన్ని వెంబడించగా పారిపోయాడని తెలిపారు. అతను మద్యం (alcohol) మత్తులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియ జేయగా ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాలు, వాహన రిజిస్ట్రేషన్ ఆధారంగా అతన్ని పట్టుకుంటామని తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (Federation of Indian Chambers of Commerce and Industry), కన్సల్టెన్సీ సంస్థ EY ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు భారత్లో ఉన్నాయని ఇటీవలి నివేదికలో తెలిపింది.