disha police:సూపర్ కాప్స్.. నిండు ప్రాణం కాపాడిన దిశ పోలీసులు
disha police:జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళను (woman) దిశ పోలీసులు (disha police) కాపాడారు. సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగారు. ఆ మహిళ వద్దకు వచ్చి.. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాల గురించి తెలుసుకొని.. తర్వాత భర్తకు (husband) అప్పగించారు. ఈ ఘటన తిరుపతిలో (tirupati) జరిగింది.
disha police:జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళను (woman) దిశ పోలీసులు (disha police) కాపాడారు. సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగారు. ఆ మహిళ వద్దకు వచ్చి.. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాల గురించి తెలుసుకొని.. తర్వాత భర్తకు (husband) అప్పగించారు. ఈ ఘటన తిరుపతిలో (tirupati) జరిగింది. పడమర రైల్వే స్టేషన్ వద్ద గల పట్టాలపై మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకోబోయింది. ఆమెను చూసిన విద్యార్థులు (students) దిశా పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఆ మహిళ ప్రాణాలను కాపాడారు.
స్కూల్స్ (schools), కాలేజీ (college), బస్ స్టేషన్ (bus station), రైల్వే స్టేషన్లో (railway station) దిశ పోలీసులు (disha police) గస్తీ తిరుగుతున్నారు. శ్రీ పద్మావతి మహిళా కాలేజీ వద్ద తిరుగుతుండగా తిరుపతి పడమర రైల్వే స్టేషన్ వద్ద రైల్వే పట్టాలపై మహిళ ఉందని సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి మహిళా పోలీసుల బృందం చేరుకుంది. పాకాల పైపు నుంచి గూడ్స్ రైలు వస్తోంది. అంతకన్నా ముందే చేరుకోవడంతో ప్రమాదం తప్పింది. విచారించగా తన పేరు ప్రసన్న అని.. బెంగళూరు (bangalore) అని పేర్కొంది. భర్త ప్రజిష్తో గొడవ పడి నిన్న ఉదయం తిరుపతికి వచ్చిందట. తిరుపతి మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి పడమర రైల్వే స్టేషన్ పైపు పట్టాలపై వెళ్లింది. వస్తువులను బ్యాగ్లో ఉంచి, ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. పట్టాలపై నిలబడగా.. ఆ సమయంలో గూడ్స్ రైలు వస్తోంది. వెంటనే దిశా మహిళా పోలీసు స్పందించడంతో నిండు ప్రాణం కాపాడినట్టు అయ్యింది.
భర్త ప్రజిష్కు పోలీసులు (police) కాల్ చేశారు. భార్యను వెతుక్కుంటూ తిరుపతి మెయిన్ రైల్వే స్టేషన్ వద్దే ఉన్నానని తెలిపాడు. ఆమెను అతని వద్దకు తీసుకొని వెళ్లి.. భార్యభర్తలు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. సమస్య ఉంటే పెద్దలకు తెలియజేయాలని కోరారు. ప్రజిష్కు భార్యను (wife) అప్పగించారు. భార్య ప్రాణాలను కాపాడిన తిరుపతి జిల్లా పోలీసులకు ప్రజిష్ కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే స్పందించిన దిశా మహిళా పోలీసులను జిల్లా ఎస్పీ పి పరమేశ్వర రెడ్డి అభినందించారు.