W.G: రాష్ట్రంలో మంచి చేసే కూటమి ప్రభుత్వంను అన్ని తరగతుల ప్రజలు ఆశీర్వదించాలని, జరిగిన మేలును పదిమందికి చెప్పాలని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో ఆదివారం ఆయన కార్యాలయంలో నియోజకవర్గంలో పేదలకు వైద్య ఖర్చు నిమిత్తం సిఎం సహాయనిధిని 31 మందికి రూ. 20 లక్షల చెక్కులను అందజేశారు.