AP: NTR జిల్లాలో ఇంటింటికీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. విజయవాడ వరలక్ష్మీనగర్లో ఇంటింటికీ వెళ్లి కార్డులను స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ ఇవాళ 9 జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోందని వెల్లడించారు. NTR జిల్లాలోనే 5.71 లక్షల మందికి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు.