GNTR: ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చేబ్రోలు పంచాయతీ కార్యదర్శి కారసాల శ్రీనివాసరావు తెలిపారు. మండల కేంద్రంలోని గొల్లపాలెం ఏరియాలో సోమవారం ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఇంటింటి చెత్త సేకరణను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ, సచివాలయ పారిశుద్ధ్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.