అన్నమయ్య: రామసముద్రం మండల కేంద్రంలో దిగుపేట సమీపంలోని సోమవారం ఓ జింక ప్రత్యక్షమయ్యింది. జింకను కుక్కలు తరమడంతో పక్కనే ఉన్న ముళ్ల చెట్లలోకి జింక పరుగులు తీసింది. ఇది గమనించిన స్థానికులు జింకను కాపాడేందుకు అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చేలోపే అది తప్పిచుకపోయి అడ్డ కొండ వైపు వెళ్లిపోయింది.