GNTR: ప్రజలకు భరోసా కల్పించే విధంగా పోలీస్ శాఖ పనిచేయాలని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. బుధవారం తెనాలి, సౌత్ పోలీస్ సబ్-డివిజన్ల పనితీరుపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. PS పరిధిలోని స్థితిగతులపై ఆయన ఆరా తీశారు. నేరాల నియంత్రణ కోసం దృఢమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, ముఖ్యంగా రౌడీషీటర్లపై నిఘా పెంచాలని అధికారులకు ఆదేశించారు.