NLR: సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో సైబర్ మోసాలు కూడా అంతకుమించి ఎక్కువగా జరుగుతున్నాయని వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉదయగిరి సీఐ ఎన్ వెంకట్రావు తెలిపారు. సర్కిల్ పరిధిలోని SR నగర్, సోమల రేగడ ఎస్సీ కాలనీలలో ప్రజలతో మాట్లాడారు. హైవే పై గేదెలు రోడ్లమీద రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, అవి రాకుండా చూడాలని సూచించారు.