పల్నాడు: చిలకలూరిపేట మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఛైర్మన్ షేక్ రఫాని సమావేశానికి అధ్యక్షత వహించారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు పురపాలక సంఘ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి అంశాలను, లోటుపాట్లను, త్రాగునీటికి సంబంధించిన ఇబ్బందులను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. కమిషనర్ హరిబాబు, ఇంజనీరింగ్ అధికారులు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.