GNT: దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణసంచా స్టాల్స్ ఏర్పాటుకు లైసెన్స్ గడవు ఈ నెల 15వ తేదీ వరకు మాత్రమే ఉందని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఆసక్తి కలిగిన వ్యాపారులు లాటరీ పద్ధతిలో ఎంపిక చేసే స్టాల్స్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. అనుమతి లేకుండా విక్రయిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.