కోనసీమ: మండపేట రైతు బజార్ వద్ద వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద నవరాత్రి మహోత్సవాలకు రాట ముహూర్తం 10 గంటల 59 నిమిషాలకు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొని, తొలుత శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం రాట ముహూర్తానికి కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.