PLD: నరసరావుపేటలోని జిల్లా YCP కార్యాలయంలో శనివారం డిజిటల్ బుక్‌ను మాజీ మంత్రి రజిని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో అధికారులు, నాయకులు పెట్టే ఇబ్బందులను, అన్యాయాలకు గురైన ప్రతి ఒక్క కార్యకర్త ఆవేదన ఈ డిజిటల్ బుక్‌లో పొందపరచవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో YCP జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి, శంకర్రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.